కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలు

16 Aug, 2019 03:56 IST|Sakshi
లదాఖ్‌లో స్థానికులతో కలిసి నృత్యం చేస్తున్న ఎంపీ త్సెరింగ్‌

కశ్మీర్‌ ప్రజల గుర్తింపునకు ఢోకా లేదన్న గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌

శ్రీనగర్‌/లెహ్‌: జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు కారణంగా రాష్ట్ర ప్రజల ప్రత్యేక గుర్తింపుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్పష్టం చేశారు. గురువారం షేర్‌–ఇ–కశ్మీర్‌ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర  జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జమ్మూకశ్మీర్‌ ప్రజల గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవని హామీ ఇస్తున్నాను. పైపెచ్చు, రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి అవి సాయపడతాయి.

నవ కశ్మీర్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను కోరుతున్నాను’అని పేర్కొన్నారు. కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా ముఖ్య నేతలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నందున వారెవరూ రాలేకపోయారు. నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడనున్న లదాఖ్‌లో ప్రజలు మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లదాఖ్‌లో జరిగిన వేడుకల్లో ప్రజలు తమ ఏకైక ఎంపీ జమ్యంగ్‌ త్సెరింగ్‌ నంగ్యా(24)తో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీకి రాఖీ కట్టిన ట్రిపుల్‌ తలాక్‌ పిటిషనర్‌

‘పరిమితం’.. దేశహితం

భారత మాజీ క్రికెటర్‌ ఆకస్మిక మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

తలనొప్పులు తెచ్చిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌

వరదలతో చెలగాటం.. తల్లీ, కూతురు మృతి

సరిహద్దులో పాక్‌ కాల్పులు

అన్నయ్య తప్ప ఎవరూ ఈ సాహసం చేయలేరు..

రక్షాబంధన్‌: భార్య కూడా భర్తకు రక్ష కట్టవచ్చు!

చెల్లెళ్లకు కేజ్రీవాల్‌ రాఖీ గిఫ్ట్‌

కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ

క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..

కిలిమంజారో అధిరోహించిన పుణే బుడతడు

కశ్మీర్‌ పైనే అందరి దృష్టి ఎందుకు?

ప్రధాని మోదీ కీలక ప్రకటన

సైనికులతో ధోనీ సందడి

అన్నను కాపాడిన రాఖి

మోదీ మరో నినాదం : ఈజ్‌ ఆఫ్‌ లివింగ్

ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల నెరవేరింది : మోదీ

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఇక నేరుగా చంద్రుడి వైపు

‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు

మూకదాడి కేసులో వారంతా నిర్దోషులే

పలు పుస్తకాల్లో అయోధ్య గురించి ప్రస్తావించారు

కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి

రైల్వే భద్రతకు ‘కోరాస్‌’

మనతో పాటు ఆ నాలుగు...

మోదీకి జైకొట్టిన భారత్‌

అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు

నీతోనే...

మిస్‌ బాంబే ఇకలేరు

రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె