పీవోకే ప్రజలు భారత్‌లో కలవాలనుకుంటారు

15 Jun, 2020 06:33 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజలు కూడా భారత్‌లో చేరాలని కోరుకుంటారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ తీర్మానంతో ఆ ప్రాంతం కూడా దేశంలో అంతర్భాగంగా మారుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో పార్టీ చేపట్టిన జన్‌సంవాద్‌ ర్యాలీనుద్దేశించి ఆయన వర్చువల్‌ ప్రసంగం చేశారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌కు భద్రతా బలగాలు తగిన బుద్ధి చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా వేర్పాటువాదుల వెన్ను విరిచామని చెప్పారు. జాతి గౌరవం కాపాడే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. సరిహద్దుల్లో సంభవించే అన్ని పరిణామాలను సరైన సమయంలో పార్లమెంట్‌లో వెల్లడిస్తామని, ఈ విషయంలో దాపరికం ఉండదని తెలిపారు. సైనిక, దౌత్యపరమైన సంభాషణల ద్వారా చైనాతో వివాదాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌ చిన్‌ కూడా భారత్‌లో కలిసిపోతుందని హోం మంత్రి అమిత్‌ షా ర్యాలీనుద్దేశించి అన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు