సెల్ఫీ కోసం బిత్తిరి చర్యలు!

10 Nov, 2018 13:21 IST|Sakshi

న్యూఢిల్లీ : స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అందరికి ఓ అలవాటుగా మారిపోయింది. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లైక్స్‌ కోసం అయితే యువత వినూత్న సెల్ఫీలకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. తాజాగా ఢిల్లీలో ప్రతిష్టాత్మక సిగ్నేచర్‌ బ్రిడ్జిపై సెల్ఫీ క్లిక్కు కోసం కొందరు చేసిన రిస్కీ టాస్క్‌లు చూస్తే ఒళ్లు గగురుపోడుస్తోంది. శుక్రవారం రాత్రి కొంత మంది యువకులు ఈ బ్రిడ్జిపై వారి బిత్తిరి చర్యలతో నానా హంగామ సృష్టించారు. వేగంగా వెళ్లున్న కారును పట్టుకోని సెల్ఫీలు దిగడం.. కారుపైకి ఎక్కడం వంటి రిస్కీ పనులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ స్పాట్‌లపై ఎక్కి మరి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ బిత్తిరి చర్యలకు సంబంధించిన ఫొటోలను ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది. 

ఇక ఇటీవల ప్రారంభమైన ఈబ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు రూ.1500 కోట్లు ఖర్చుచేశారు. యమునా నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి... ఢిల్లీలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల మధ్య ట్రాఫిక్‌ సమస్యను తీర్చడంతో పాటు సందర్శకులకూ కనువిందు చేస్తోంది. 154 మీటర్ల (505 అడుగులు) ఎత్తున్న ఈ వంతెన శిఖరం మీదకు వెళ్లి చుట్టూ ఢిల్లీ నగరం అందాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంది. అందుకోసం ఈ బ్రిడ్జి శిఖరం మీద అద్దాల గది ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి ఒకేసారి 50 మంది వరకూ వెళ్లొచ్చు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా