'అది ఉంటే.. వారికి నిద్ర పట్టదు'

7 Apr, 2016 20:27 IST|Sakshi
'అది ఉంటే.. వారికి నిద్ర పట్టదు'

న్యూ ఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచుకున్న వారికి రాత్రిళ్లు నిద్రపట్టదని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. పనామా పేపర్స్ లీకేజ్ అంశంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న భారతీయుల ఆర్థిక వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఈ నల్ల కుభేరుల బండారం అందరికీ తెలుస్తోందని అరుణ్ జైట్లీ వెల్లడించారు.

విదేశాల్లో కంపెనీలు స్థాపించి పెట్టుబడులు పెట్టినవారిలో ఎంతమంది భారత చట్టాలకు లోబడి నడుచుకున్నారో విచారణ జరుపుతామన్నారు. 'ఆర్బీఐ అనుమతి తీసుకొని విదేశాల్లో కంపెనీలు పెడితే అది చట్టబద్ధం అని, లేనిచో అది చట్టవిరుద్ధం' అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జైట్లీ గుర్తుచేశారు. గత నాలుగు రోజులుగా పనామా పేపర్స్ లీకేజ్ అంశంపై మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు సైతం ఈ వ్యవహారంలో తలలు పట్టుకుంటున్నారు. అయితే దీంతో ప్రమేయమున్న 500 మంది భారతీయుల్లో ఎంతమంది చట్టబద్ధంగా ఆర్బీఐ అనుమతితో లావాదేవీలు జరిపారనే విషయం తేలాల్సి ఉంది.


 

మరిన్ని వార్తలు