ఉత్తర రైల్వే పీపీఈ నమూనాలకు ఆమోదం

6 Apr, 2020 09:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఉత్తర రైల్వే వర్క్‌షాపులో రూపొందించిన రెండు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) నమూనాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే యూనిట్లలో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. శరీర భాగాల్లో రక్తం, ఇతర స్రావాల ప్రసరణ కోసం ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోజుకు 20 వరకు ఈ పరికరాలను తయారు చేస్తున్నామని, ఇకపై రోజుకు 100కు పైగా రూపొందిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న  రైల్వే ఆసుపత్రుల్లో వీటిని ఉపయోగిస్తామని పేర్కొన్నాయి.

దేశంలో పీపీఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది భయం భయంగా పనిచేయాల్సి వస్తోంది. సరిపడగా పీపీఈ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్‌డీవో పాటు పలు సంస్థలు వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. (చైనా ఎన్ని మాస్క్‌లు అమ్మిందంటే..?)

మరిన్ని వార్తలు