‘పురుషోత్తమపట్నం’ పై ఎన్జీటీలో పిటిషన్‌

28 May, 2018 17:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా చేపట్టిన పురుషోత్త‌మప‌ట్నం ఎత్తిపోత‌ల పథకం ప్రాజెక్టును సవాల్‌ చేస్తూ  జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ)లో పిటిషన్‌ దాఖలైంది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషన్‌ స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, పోలవరం అథారిటీ, జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ, ఓడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలకు  నోటీసులు జారీ చేసింది. జూలై మూడో వారానికల్లా సమాధానం చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. 

గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగు, విశాఖకు తాగు, పారిశ్రామిక జల అవసరాలు తీర్చాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

మరిన్ని వార్తలు