12 వ రోజూ పెట్రో సెగ

18 Jun, 2020 09:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు , డీజిలు ధరలు  రోజు రోజుకు పెను భారంగా మారుతున్నాయి.  దేశీయంగా  పెరుగుతూ వస్తున్న ధరలు వరుసగా 12వ రోజు గురువారం కూడా అదే బాటలో సాగాయి.  తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది.  దీంతో  ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిలు ధర 7 రూపాయల 4 పైసలు  చొప్పున పెరిగింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు
న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.81 డీజిల్  రూ.76.43
ముంబై :  పెట్రోలు ధర రూ. 84.66, డీజిల్  రూ.74.93
చెన్నై: పెట్రోలు ధర రూ. 81.32 డీజిల్  రూ.74.23

హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.77, డీజిల్ రూ.74.70
అమరావతి : పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్ రూ.75.14

 

ముడి చమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోతున్నా..దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్‌ 6 న మొదలైన పెట్రో ధరల పెంపు ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది.  ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు