ఏప్రిల్‌ నుంచి పెట్రో ధరల పెరుగుదల!

31 Jan, 2020 06:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత పెట్రోలు, డీజిల్‌ ధరలు 50పైసల నుంచి 1 రూపాయి వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం వాహనాలకు బీఎస్‌ 4 ప్రమాణ ఇంధనం వాడుతుండగా.. ఏప్రిల్‌ 1 నుంచి మరింత మెరుగైన బీఎస్‌ 6 ప్రమాణ ఇంధనం వినియోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైంది. ‘బీఎస్‌ 6’ ఇంధనం కారణంగా వాహన కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. బీఎస్‌ 6 గ్రేడ్‌ ఇంధన ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించామని, వచ్చే నెలలో అన్ని డిపోలకు బీఎస్‌ 6 గ్రేడ్‌ ఇంధనం చేరుతుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి పూర్తిగా బీఎస్‌ 6 గ్రేడ్‌ ఇంధనమే వాహనాలకు అందుబాటులో ఉంటుందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా