ఆగస్టు 15 గిఫ్ట్.. పెట్రోలు ధర తగ్గింపు?

13 Aug, 2014 19:08 IST|Sakshi
ఆగస్టు 15 గిఫ్ట్.. పెట్రోలు ధర తగ్గింపు?

పెట్రోలు ధర లీటరుకు రెండు రూపాయల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 103 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఇరాక్ సంక్షోభం సమయంలో ఈ క్రూడాయిల్ బ్యారెల్కు దాదాపు 115 డాలర్లు ఉండేది. ఇప్పుడు గణనీయంగా దీని ధర తగ్గడంతో ఈ మేరకు వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలని చమురు కంపెనీలు భావిస్తున్నాయి.

ఆగస్టు ఒకటో తేదీన లీటరు పెట్రోలు ధర రూ. 1.09 మేర తగ్గింది. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రో ధరలను సమీక్షిస్తుంటారు. డీజిల్ ధరను నెలకు 50 పైసల వంతున పెంచుతున్నారు. ఇప్పటికే ఆగస్టు ఒకటోతేదీన ఒకసారి ధరలను సవరించారు కాబట్టి, మళ్లీ ఆగస్టు 15వ తేదీన ధర తగ్గింపును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా వినియోగదారులకు ఈ కానుక అందుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు