-

పెట్రో షాక్‌లతో విలవిల...

27 Aug, 2017 18:24 IST|Sakshi
పెట్రో షాక్‌లతో విలవిల...
న్యూఢిల్లీః పెట్రోల్‌ ధరలను రోజువారీ సవరణ పేరుతో కొద్దికొద్దిగా పెంచుతున్న చమురు సంస్థలు జులై నుంచి ఇప్పటివరకూ పెంచిన మొత్తం చూస్తే షాక్‌ తినాల్సిందే. జులై నుంచి పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ 6 పెరగ్గా, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ 3.67 పైసల మేర భారమయ్యాయి. పెట్రోల్‌ ధరలు మూడేళ్ల గరిష్టస్థాయిలో పెరగ్గా, డీజిల్‌ ధరలు నాలుగు నెలల గరిష్టస్ధాయిలో పెరిగాయి. ప్రతినెలా 1, 16 తేదీల్లో ధరలను సవరిస్తున్న విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు జూన్‌ నుంచి రోజూ ధరలను మార్చే విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
 
ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభమైన తొలి పక్షం రోజుల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు ఇక అప్పటినుంచి పెరుగుతూనే ఉన్నాయి.గతంలో పెట్రో ధరలు ఒకేసారిగా పెంచడంతో కస్టమర్లకు దీనిపై అవగాహన ఉండేదని, ఇప్పుడు రోజుకు పైసా, పదిహేను పైసల చొప్పున పెంచుతుంటే పెద్దగా గుర్తించడం లేదని ఓ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు