విడతల వారీగా మద్య నిషేధం.. స్పందించిన స్టార్ హీరో

5 Feb, 2018 13:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: మద్య నిషేధం అంటేనే చాలు ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఎందుకంటే మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం చూకూరుతుందని, వాటి విషయంలో నేతలు ఆచితూచి అడుగేస్తుంటారు. కానీ, తమిళనాడు ప్రభుత్వం మద్య నిషేధానికి కట్టుబడి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విడతల వారీగా మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా 500 మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని స్టార్ హీరో విశాల్ స్వాగతించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు గతంలో అన్ని పార్టీలు మద్యనిషేధం అంటూ హామీలిచ్చేశాయి. కానీ, మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. డీఎంకె, ఏఐఏడీఎంకే, పీఎంకే పార్టీలు ఎన్నికలనగానే మద్య నిషేధానికి మ్యానిఫెస్టోలో ప్రాధాన్యతనిచ్చేవి. అమలుకు మాత్రం ఆ హామీ నోచుకోక పోయేది. చివరికి పళనిస్వామి హయాంలో మద్య నిషేధానికి శ్రీకారం చుట్టడంతో హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు