శివరాజ్‌ సింగ్‌ తిన్నది నాన్‌వెజ్‌ కాదు!

20 Nov, 2018 10:53 IST|Sakshi
శివరాజ్‌ సింగ్‌ మార్ఫింగ్‌ ఫొటో

భోపాల్‌ :  ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు.. సోషల్‌ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. ప్రచార సభలో నాయకుల మాటల తూటాలు.. పొరపాట్లపై జోకులు కూడా పేలుతున్నాయి. అయితే కొన్ని వైరల్‌ అవుతున్న అసత్య వార్తలు.. నాయకులకు తలనొప్పిగా మారాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. స్వచ్ఛమైన.. అచ్చమైన హిందువుగా చెప్పుకునే శివరాజ్‌ సింగ్‌ చాటుమాటుగా మాంసాహారం తింటున్నాడని ఓ ఫొటో తెగ వైరల్‌ అయింది. అయితే ఆ ఫొటో మార్ఫ్‌ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఇండియా టుడే గుర్తించింది.

వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలో హెలికాప్టర్‌లో కూర్చొని శివరాజ్‌ సింగ్‌ భోజనం చేస్తున్నారు. తన భోజన ప్లేట్‌లోని కర్రీస్‌ను.. కొందరు నాన్‌వెజ్‌గా మార్ఫ్‌ చేసి వైరల్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్‌ 17న శివరాజ్‌ సింగ్‌ హెలికాప్టర్‌లో భోజనం చేశారని, ఇది పీటీఐ తీసిన ఫొటో అని ఇండియాటూడే పేర్కొంది. ఇక ఫొటోను నిశితంగా పరిశీలిస్తే ఎవరికైన ఇది మార్ఫింగ్‌ ఫొటోనేనని స్పష్టం అవుతోంది. శివరాజ్‌ భోజనం చేస్తున్న ప్లేట్‌లో స్పూన్‌ పూర్తిగా కనిపిస్తోంది... కానీ మార్ఫింగ్‌ చేసిన ఫొటోలో స్పూన్‌ సగం మాత్రమే కనబడుతోంది.

మరిన్ని వార్తలు