వెంకయ్య నాయుడిపై ఆరోపణలు

2 Aug, 2017 17:10 IST|Sakshi
వెంకయ్య నాయుడిపై ఆరోపణలు

న్యూఢిల్లీ: మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి విమర్శించారు. ఎస్సీలను ఏబీసీడీలు వర్గీకరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జంతర్‌మంతర్‌ వద్ద మాదిగ జేఏసీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాదిగలను వెంకయ్య నాయుడు ఉపయోగించుకుని ఉపరాష్ట్రపతి అవుతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల వరకైనా వర్గీకరణ అంశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని నిన్న పిడమర్తి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయించిందన్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు