జెట్‌ నుంచి ఎజెక్ట్‌ అయితే.. ఎట్లుంటదో తెలుసా ?

2 Mar, 2019 04:42 IST|Sakshi

అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు జెట్‌ విమానాల నుంచి దూకాల్సి వస్తుంది. అలా దూకడం అంత సులువేం కాదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలా దూకిన తర్వాత గాయాలపాలైన పైలట్లు కొన్ని సంవత్సరాల వరకు ఏ విమానాన్ని కూడా నడపలేరు. విమానం నుంచి సడన్‌గా సీటు విడిపోవడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. దూకే సమయంలో సాధారణ గురుత్వాకర్షణ శక్తి కన్నా 14 నుంచి 16 రెట్లు ఎక్కువగా సీటుపై శక్తి పనిచేస్తుంది. గాలి వేగంగా ఉన్న సమయంలో జెట్‌ నుంచి దూకడం వల్ల చేతులు విరుగుతుంటాయి. భుజం ఎముకకు గాయాలు అవుతుంటాయి. కాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశ ఉంటుంది. మంటలు రావడంతో శరీరం కాలిపోయే ప్రమాదం ఉంది. 
 
 

మరిన్ని వార్తలు