పినాక రాకెట్ల పరీక్ష విజయవంతం

8 Aug, 2013 05:06 IST|Sakshi

బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను బుధవారం ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. బాలసోర్‌కు సమీపంలోని చాందీపూర్ తీరం వద్దనున్న స్థావరం నుంచి మల్టీబ్యారెల్ రాకెట్ లాంఛర్ ద్వారా రెండు రౌండ్ల పినాకా రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
 
 సాధారణ పరీక్షల్లో భాగంగానే ఈ ప్రయోగాలు జరిపినట్లు పేర్కొన్నాయి. 1995 నుంచి వివిధ క్లిష్ట పరీక్షలను అధిగమించిన పినాకా రాకెట్లను ఇప్పటికే సైన్యం వాడుతోంది. ఈ ఏడాది జూలైలో అధునాతన పినాకా మార్క్-2 మల్టీబ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పరీక్షలను పశ్చిమ రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో జరిపినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే ఈ ఆధునిక రాకెట్లను సైన్యంలోకి చేరుస్తామన్నారు. శతఘు్నలకు సహాయకంగా 40 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని అభివృద్ధి చేశారు.

మరిన్ని వార్తలు