రూ మూడు లక్షల కోట్లకు పెరిగిన రక్షణ బడ్జెట్‌

1 Feb, 2019 12:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ శాఖకు రూ మూడు లక్షల కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. పార్లమెంట్‌లో శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సైనికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. ఇప్పటికే వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ కోసం రూ 35,000 కోట్లు కేటాయించామన్నారు. సైనికులకు అలవెన్సులు, వేతన పెంపు చేపట్టామన్నారు.

సైనికులే దేశానికి గర్వకారణమని, 40 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఒన్‌ ర్యాంక్‌ ఒన్‌ పెన్షన్‌ను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిందన్నారు. ప్రభుత్వం త్వరలో నేషనల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుందన్నారు.

మరిన్ని వార్తలు