భారత్‌ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ : పీయూష్‌ గోయల్‌

1 Feb, 2019 11:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో ఆర్థిక మం‍త్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పీయూష్‌ గోయల్‌ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మోదీ సారథ్యంలో సుస్థిర పాలన అందిచామన్నారు. అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే భారత్‌ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ దూసుకుపోతోందన్నారు. విధాన నిర్ణయాల్లో వేగం పెంచామన్నారు.

మరిన్ని వార్తలు