అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు!

29 May, 2020 14:00 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్ల లోపు, 65 ఏళ్ల పైబడని వారెవ్వరు కూడా  అత్యవసరం అయితే తప్పించి శ్రామిక రైళ్లలో ప్రయాణించరాదు’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రజలకు శుక్రవారం వెల్లడించారు. ప్రయాణికుల అందరి భద్రతకు రైల్వే సిబ్బంది అండగా నిలుస్తారని ఆయన ట్వీట్‌ చేశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల్లోనే శ్రామిక రైళ్లలో 9 మంది ప్రయాణిలు మరణించిన అసాధారణ పరిస్థితుపై గోయల్‌ స్పందించారు. (కరోనా: 9వ స్థానానికి ఎగబాకిన భారత్‌ )

దేశవ్యాప్తంగా వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు తాము ప్రతి రోజూ ప్రత్యేక శ్రామిక రైళ్లను నిర్వహిస్తున్నామని, అయితే కొంత మంది అనారోగ్యంతో బాధ పడుతున్న వారు కూడా ఈ రైళ్లలో ప్రయాణించడం వల్ల దురదష్టవశాత్తు వారు మత్యువాత పడ్డారని రైల్వే శాఖ అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మధుమేహం, గుండె జబ్బులతో బాధ పడుతున్న రైల్వే ప్రయాణికులకు ట్యాబ్లెట్లు వేసుకునేందుకు కనీసం మంచినీరు కూడా దొరక్కపోవడంతో వారు మరణించారని మతుల బంధువులు వాపోయారు. (భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు! )

ఎండలు తీవ్రమైన నేపథ్యంలో మంచినీళ్ల అవసరం మరింత పెరిగిందని వలస కార్మికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సాయం ఏది అవసరమైనా తమ 138, 139 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. వలస కార్మికులకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఉచితంగా అన్న పానీయాలను అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానదేనంటూ సుప్రీం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు చేయడం గమనార్హం. (భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు