పార్లమెంట్‌కు చేరుకున్న పీయూష్‌ గోయల్‌

1 Feb, 2019 10:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యంతర బడ్జెట్‌ను మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.బడ్జెట్‌ పత్రాలతో ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు. అంతకుముందు పీయూష్‌ గోయల్‌ రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్న అనంతరం నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు.

కాగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానుండటంతో మధ్యంతర బడ్జెట్‌లో గ్రామీణ రైతాంగానికి, పట్టణ మధ్యతరగతి వర్గాలకు చేరువయ్యే పథకాలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. రైతులకు నగదుసాయం, వేతనజీవులకు ఊరటగా ఐటీ మినహాయింపు పరిమితి పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు