కొత్త మార్గాల్లో... ఉడాన్‌ 

27 Jan, 2019 02:51 IST|Sakshi

హైదరాబాద్‌ నుంచి  8 కొత్త నగరాలకు కనెక్టివిటీ 

నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్, విజయవాడకు ఎయిర్‌ వే 

ఏపీ నుంచి కూడా కొత్త రూట్లలో విమాన ప్రయాణం 

ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌ (ఉడాన్‌) ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఉడాన్‌ మూడో రౌండ్‌ బిడ్డింగ్‌లో ఎంపిక చేసిన విమాన ప్రయాణ మార్గాల ద్వారా తెలంగాణ, ఏపీ నుంచి మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 235 రూట్లను కేంద్ర పౌర విమానయాన మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

ఈసారి పర్యాటక శాఖ సహకారంతో పలు ప్రాంతాలను ఉడాన్‌లో ఎంపిక చేశారు. 6 వాటర్‌ ఏరోడ్రమ్స్‌ ద్వారా కొత్తగా 18 రూట్లలో సీప్లేన్స్‌కు కూడా అనుమతించారు. వీటిలో తెలంగాణలోని నాగార్జునసాగర్‌ వాటర్‌ ఏరో డ్రమ్‌ కూడా ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, విజయవాడకు విమానయాన సౌకర్యం ఏర్పడనుంది. ఈ మార్గాన్ని టర్బో ఏవియేషన్‌కు 
కేటాయించారు.  
–సాక్షి, న్యూఢిల్లీ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాప పేరు కరోనా.. బాబు పేరు లాక్‌డౌన్‌

కరోనాపై ప్రభుత్వానికి 10 ప్రశ్నలు

కరోనాపై పోరు: వారికి రూ. కోటి పరిహారం

కరోనా రోగులకు రోబోలతో సేవలు..

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

సినిమా

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..

ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి