నీటిలో వేసినా కరగలేదు.. ప్లాస్టిక్‌ చక్కెర కలకలం

23 Nov, 2017 18:05 IST|Sakshi

సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో నకిలీ చక్కెర కలకలం రేపింది. గురువారం ఒక దుకాణంలో చక్కెర కొనుగోలు చేసిన ఓ వ్యక్తి నీటిలో వేసినా కరగకపోవడంతో అది ప్లాస్టిక్‌ చక్కెర అంటూ ఆందోళనకు దిగాడు. ఖిల్లా మొహల్లాలో ఉన్న ఒక కిరాణా అంగడిలో అతను తమ టీ స్టాల్‌ కోసం 2 కేజీల చక్కెరను కొన్నాడు.

దానిని టీలో వేసినప్పుడు ఎంతసేపైనా కరగకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో మొత్తం చక్కెరను పరిశీలించాడు. అది చక్కెర మాదిరిగా కనిపించే ప్లాస్టిక్‌ రవ్వ అని గుర్తించి వెంటనే మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఇటీవలే నగరంలో రూ. 2 వేల నకిలీ నోటు రావడం, తాజాగా ప్లాస్టిక్‌ చెక్కర కలకలంతో ప్రజలు కల్తీల మాయాజాలంపై ఆందోళనకు గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు