-

జూమ్‌ యాప్‌పై సుప్రీంలో పిటిషన్‌

21 May, 2020 08:51 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో ‘జూమ్‌ యాప్‌’ను నిషేధించాలని సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు అయింది. హర్ష్‌ చుగ్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. జూమ్‌ యాప్‌ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తగిన చట్టాలు రూపొందించేవరకు జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌పై నిషేధం కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ యాప్‌ సురక్షింతం కాదని.. ఇందులో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ లేదని తెలిపారు. (చదవండి : ‘జూమ్‌’ సేఫ్‌ కాదు)

ఈ యాప్‌ వినియోగిస్తున్నవారి వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000, ఇన్మరేషన్‌ టెక్నాలజీ రూల్స్‌ 2009 నిబంధనలను ఈ యాప్‌ ఉల్లంఘింస్తుందని పేర్కొన్నారు. ఈ యాప్‌ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్‌, సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. 

కాగా, జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌కు సంబంధించిన లోటుపాట్లపై ఆ సంస్థ సీఈఓ ఇప్పటికే వినియోగదారులను క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు జూమ్‌ యాప్‌ అంత సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ కోసం వ్యక్తులు, సంస్థలు జూమ్‌ యాప్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. (చదవండి : పాతాళానికి టిక్‌ టాక్‌ రేటింగ్స్‌)

మరిన్ని వార్తలు