చీపురు పట్టి.. చెత్తను ఊడ్చి

3 Oct, 2014 01:34 IST|Sakshi
చీపురు పట్టి.. చెత్తను ఊడ్చి

న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్’ పట్ల తన చిత్త శుద్ధిని చీపురు పట్టి మరీ నిరూపించుకున్నారు ప్రధాని మోదీ. మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా గురువారం వారికి నివాళులు అర్పించి వస్తూ.. దారిలో ఉన్న మందిర్ మార్గ్ పోలీస్‌స్టేషన్ వద్ద కాన్వాయ్‌ని ఆపి, పోలీస్ స్టేషన్లో పరిశుభ్రత ఎలా ఉందో పరిశీలించారు. అంతేకాదు.. అక్కడ పేరుకుని ఉన్న చెత్తను స్వయంగా చీపురు పట్టి ఊడ్చి, శుభ్రం చేశారు. అక్కడి పోలీసులకు పరిశుభ్రతపై క్లాస్ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి పారిశుద్ధ్య కార్మికులు నివసించే వాల్మీకి బస్తీకి వెళ్లి అక్కడి పేవ్‌మెంట్‌లను శుభ్రం చేశారు. ఆ తరువాతే రాజ్‌పథ్ రోడ్‌లో స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు