రూ.100 కోట్ల సాయం.. మోదీ ప్రశంస!

14 Apr, 2020 17:27 IST|Sakshi

న్యూఢిల్లీ: కలిసి కట్టుగా పోరాడి భారత్‌ మహమ్మారి కరోనాను తరిమికొడుతుందని ప్రధానమంత్రి మోదీ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కరోనాపై పోరును మరింత బలోపేతం చేసే విధానం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్స్  తరపున రూ.100 కోట్లు విరాళం అందించిన అవెన్యూ సూప‌ర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రమోటర్‌ రాధాకిషన్‌ దామనిని ప్రధాని ప్రశంసించారు. కాగా, బ్రైట్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ పీఎం కేర్స్‌తోపాటు రూ.55 కోట్లను ఆయా రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
(చదవండి: క‌రోనా అత‌న్ని బిలియ‌నీర్ చేసింది)

మహారాష్ట్ర, గుజరాత్‌కు రూ.10 కోట్లు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, రాజస్తాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్‌గర్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు రెండున్నర కోట్ల చొప్పున సాయం చేసింది. కోవిడ్‌ కట్టడికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతునిస్తున్నామని ప్రకటించింది. కాగా, లాక్‌డౌన్‌ భయాల్లో జనం భారీగా కొనుగోళ్లు సాగించడంతో బ్రైట్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థల్లో ఒకటైన డీమార్ట్‌కు అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 206 డీమార్ట్‌ సూపర్‌మార్కెట్లు ఉన్నాయి.
(చదవండి: క‌రోనాతో ఫైట్‌కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం)

మరిన్ని వార్తలు