నీతి ఆయోగ్‌ : ప్రధాని కీలక నిర్ణయం

6 Jun, 2019 21:04 IST|Sakshi

నీతి ఆయోగ్‌ పునర్‌ వ్యవస్థీకరణ

సాక్షి, న్యూఢిల్లీ :  ప్రధానమంత్రి నరేంద్ర నీతి ఆయోగ్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  మోదీ సర్కార్‌ కేంద్రంలో నీతి ఆయోగ్‌ పునర్‌ వ్యవస్థీకరణరెండవ సారి బాధ్యతలను చేపట్టిన అనంతరం జూన్‌ 15న నీతి ఆయోగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం జరగనున్న నేపథ్యంలో సంస్థ పునర్‌ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. రాజీవ్‌ కుమార్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌  ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొత్తగా చేరనున్నారు. ఈ మేరకు పీఐబీ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. అయితే  ఎన్‌డీఏ -1 హయాంలో నీతి ఆయోగ్‌కు సీఈవో అమితాబ్‌ కంత్‌ ప్రస్తావన లేదు. ప్రధాన మోదీ ఛైర‍్మన్‌గా ఉండే నీతి ఆయోగ్‌లో సభ్యులుగా వీకే సరస్వత్‌, రమేష్‌ చాంద్‌, డాక్టర్‌ వీకే పాల్‌ ఉంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు  ఈ భేటీకి హాజరుకానున్నారు. యూపీఏ హయాంలో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌  ఏర్పడిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు