బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందన

5 Jul, 2019 14:07 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్‌ ద్వారా మధ్య తరగతి వర్గానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పన్ను విధానాన్ని సులభతరం చేశామని, అదే విధంగా మౌలిక వసతుల కల్పనలో సరికొత్త అభవృద్ధిని చూడబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ‘ దేశంలోని ప్రతీ పౌరుడికి మేలు కలిగించే బడ్జెట్‌ ఇది. దీని ద్వారా పేదలకు మంచి జరుగుతుంది. యువతకు లబ్ది చేకూరుతుంది’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో విప్లవాలకు నాంది పలికేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని, నవభారతానికి ఇదొక రోడ్‌మ్యాప్‌లా ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా 2019-20 సంవత్సారానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. రక్షణశాఖ మంత్రిగా అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నఆమె ఆర్థిక మంత్రి హోదాలో మొట్టమొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డులకెక్కారు.

మరిన్ని వార్తలు