16 ఏళ్ల కుర్రాడి ప్రతిభ.. ప్రధాని అభినందనలు..!

9 Sep, 2019 10:23 IST|Sakshi

న్యూఢిల్లీ : వేద, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన వ్యాకరణ గ్రంథాలన్ని అవపోసన పట్టి ప్రియవ్రత అనే 16 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. కష్టతరమైన 14 రకాల తెనాలి పరీక్షలు దాటుకుని ‘మహా పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించాడు. దాంతో చిన్న వయసులోనే  ‘మహా పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ కుర్రాడి గొప్పతనాన్ని కృష్ణశాస్త్రి అనే వ్యక్తి ప్రధాని మోదికి ట్విటర్‌లో వివరించడంతో ఆయన స్పందించారు. చిన్న వయసులోనే గొప్ప ప్రావిణ్యం సంపాదించావని మెచ్చుకున్నారు. ‘కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అద్భుతం చేశావ్‌. అభినందనలు.  నీ ఉన్నతి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’అని ట్వీట్‌ చేశారు.  తండ్రి దేవదత్తా పాటిల్‌, గురువు మోహనశర్మ వద్ద ప్రియవ్రత వేదాధ్యయనం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు