ఇ‍మ్రాన్‌ ఖాన్‌కు మోదీ అరుదైన గిఫ్ట్‌

10 Aug, 2018 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ: కాబోయే పాకిస్తాన్‌ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపురూపమైన కానుకను పంపించారు.  పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు మాజీ కెప్టెన్‌కూడా అయిన్‌ ఖాన్‌కు క్రికెట్‌ బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపించారు. భారత క్రికెట్‌ జట్టు సభ్యులందరూ సంతకాలు చేసిన ఈ అరుదైన క్రికెట్‌ బ్యాట్‌ను భారత  హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా  శుక్రవారం ఇమ్రాన్‌ఖాన్‌కు అందించారు.

రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలపై  చర్చించేందుకు భారత రాయబారి అజయ్ బిసరియా  పాకిస్థాన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా  ఆయన ఇమ్రాన్ ఖాన్‌,ఇతర ఉన్నతాధికారులను పిలిచి  ప్రధాని మోదీ తరఫునఈ బ్యాట్‌ను బహుకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధించిన ఘనవిజయానికి గాను అభినందనలు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న పాక్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సెనేటర్ ఫైసల్ జావేద్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ముగ్గురు మాజీ భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గవాస్కర్లను  ఆహ్వానించినట్టు తెలిపారు.

కాగా జూలై 26న జరిగిన ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఇమ్రాన్‌ ఖాన్ నేతృత్వంలోని పార్టీ 116 సీట్లను గెలుచుకుని అతిపెద్ద రాజకీయ పార్టీగా  అవతరించింది.  ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ  ఇమ్రాన్ అభినందించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు