రైతు పెన్షన్‌ స్కీమ్‌కు శ్రీకారం..

12 Sep, 2019 15:08 IST|Sakshi

రాంచీ : రైతులకు పెన్షన్‌ అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజనను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో ప్రారంభించారు. ఈ పధకం జార్ఖండ్‌ను భారత్‌తో పాటు ప్రపంచానికి అనుసంధానం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఈ పధకం కింద ప్రస్తుతం 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన సన్న, చిన్నకారు రైతులు వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకు రూ 3000 పెన్షన్‌ అందుకుంటారు. రానున్న మూడేళ్లకు రూ 10,774 కోట్లను ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజన పధకానికి కేటాయించారు. కాగా రాంచీలో మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ సచివాలయ భవనానికి శంకుస్ధాపన చేశారు.

మరిన్ని వార్తలు