'50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి'

20 Jun, 2020 12:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 'గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన' పేరుతో శనివారం రోజున బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 50వేల కోట్ల రూపాయలతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నారు.

దేశ వ్యాప్తంగా మొత్తం వలస కూలీలు ఎక్కువగా తరలి వచ్చిన 116 జిల్లాల్లో మొదట ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ పథకం కింద బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఎంపికైనట్టు తెలిపారు. వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామన్నారు. 25 భిన్న రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి లభించనుంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. చదవండి: దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు: ప్రధాని మోదీ

>
మరిన్ని వార్తలు