నినాదాల ‘వార్‌’ణాసి

5 Mar, 2017 01:20 IST|Sakshi
నినాదాల ‘వార్‌’ణాసి

వారణాసి: ప్రధాన పార్టీల ఎన్నికల రోడ్‌షోలతో ఉత్తరప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికల కేంద్రమైన వారణాసి దద్దరిల్లింది. బీజేపీ, ఎస్పీ పార్టీల పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని చేసిన ‘ఖబరస్తాన్ , శ్మశాన్ ’ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలో భారీ స్పందన కనిపించింది.  మోదీ కాశీలో పర్యటించాల్సి ఉన్నా.. పర్యటనను శనివారానికి మార్చారు. మరోవైపు, రెండోసారి యూపీలో అధికారాన్ని ఆశిస్తున్న సీఎం అఖిలేశ్‌ ప్రచారం కూడా శనివారం వారణాసిలో రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ భార్య, ఎంపీ డింపుల్‌ కూడా ఈ రోడ్‌ షోలో పాల్గొన్నారు. వారణాసితోపాటు చుట్టుపక్కన జిల్లాల్లో 8న పోలింగ్‌ ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు