అన్నయ్య తప్ప ఎవరూ ఈ సాహసం చేయలేరు..

15 Aug, 2019 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ : ముస్లిం మహిళా హక్కులను కాపాడేందుకై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ చూపారని ఆయన ‘రాఖీ చెల్లెలు’ ఖమర్‌ మోహిసిన్‌ షేక్‌ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో తన అన్నయ్య మోదీ తప్ప మరెవరూ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేరని ప్రశంసించారు. గురువారం రక్షా బంధన్‌ సందర్భంగా నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు ఆమె ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖమర్‌ మాట్లాడుతూ...‘ ప్రతీ యేడు అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న ఐదేళ్లలో ఆయన ప్రపంచం గుర్తించే మరెన్నో గొప్ప, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నా. తక్షణ ముమ్మారు తలాక్‌ గురించి ఖురాన్‌, ఇస్లాంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది’ అని పేర్కొన్నారు.

కాగా పాకిస్తాన్‌ జాతీయురాలైన ఖమర్‌ పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఆరెస్సెస్‌ కార్యకర్తగా ఉన్ననాటి నుంచి ఆయనకు ఖమర్‌ రాఖీ కడుతున్నారు. గత 20 ఏళ్లుగా ఈ ఆనవాయితీ క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఇక ఈరోజు కూడా ఆమె తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లారు. అదే విధంగా తన భర్త వేసిన పెయింట్‌ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరిహద్దులో పాక్‌ కాల్పులు

రక్షాబంధన్‌: భార్య కూడా భర్తకు రక్ష కట్టవచ్చు!

చెల్లెళ్లకు కేజ్రీవాల్‌ రాఖీ గిఫ్ట్‌

కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ

క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..

కిలిమంజారో అధిరోహించిన పుణే బుడతడు

కశ్మీర్‌ పైనే అందరి దృష్టి ఎందుకు?

ప్రధాని మోదీ కీలక ప్రకటన

సైనికులతో ధోనీ సందడి

అన్నను కాపాడిన రాఖి

మోదీ మరో నినాదం : ఈజ్‌ ఆఫ్‌ లివింగ్

ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల నెరవేరింది : మోదీ

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఇక నేరుగా చంద్రుడి వైపు

‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు

మూకదాడి కేసులో వారంతా నిర్దోషులే

పలు పుస్తకాల్లో అయోధ్య గురించి ప్రస్తావించారు

కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి

రైల్వే భద్రతకు ‘కోరాస్‌’

మనతో పాటు ఆ నాలుగు...

మోదీకి జైకొట్టిన భారత్‌

అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్‌కే అద్వానీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్టికల్‌ 370 రద్దు.. కశ్మీర్‌కు ఎంతో మేలు: కోవింద్‌

బాత్రూమ్‌లో శృంగారానికి నిరాకరించిందని..!

ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

ఇకపై అక్కడ సోనియా మాత్రమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గ్యాంగ్‌ లీడర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌

సుభాష్‌ చంద్రబోస్‌.. సైరా.. మణికర్ణిక

‘రణరంగం’ మూవీ రివ్యూ

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి మృతి..

‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్