మౌలిక రంగంపై ప్రధాని సమీక్ష

4 Aug, 2018 03:53 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలు, రహదారులు, విమాన, నౌకాశ్రయాలు, గృహ నిర్మాణం సహా వివిధ కీలక మౌలిక రంగ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్న తీరును నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సహా పలువురు ఉన్నతాధికారులు మోదీకి వివరించారు. 2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సగటున రోజుకు 11.67 కి.మీ.ల రోడ్డు నిర్మాణం జరగ్గా, 2017–18లో అది 26.93 కి.మీ.లకు పెరిగినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. 2014–18 మధ్య కాలంలో ప్రధాన మంత్రి గ్రామీణ రహదారుల పథకం కింద 44 వేల గ్రామాలకు రోడ్లు నిర్మించామనీ, అంతకు ముందటి నాలుగేళ్లలో        ఈ సంఖ్య 35 వేలుగా ఉందని పీఎంవో      వెల్లడించింది. ప్రస్తుతం రహదారులపై 22 శాతం టోల్‌ఫీజులు ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల పద్ధతిలో వస్తున్నట్లు అధికారులు మోదీకి చెప్పగా, డిజిటల్‌ చెల్లింపులను మరింత పెంచాలని ఆయన ఆదేశించారు.

మరిన్ని వార్తలు