వారిని కలిసేందుకు భయపడను..

29 Jul, 2018 16:39 IST|Sakshi

లక్నో : పారిశ్రామికవేత్తలతో తాను సన్నిహితంగా ఉంటానన్న విపక్షాల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా బదులిచ్చారు. ఇతరుల మాదిరి తాను పారిశ్రామికవేత్తలతో కలిసి కనిపించేందుకు భయపడబోనని పరోక్షంగా రాహుల్‌, కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దేశ ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిప్తారని పేర్కొన్నారు. గతంలో మహాత్మ గాంధీ స్వాతంత్ర​పోరాట సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన బిర్లా హౌస్‌లో బస చేసేవారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. పరిశ్రమ అధినేతలు హాజరైన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆదివారం లక్నోలో 81 ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు.

కొందరు బాహాటంగా పారిశ్రామికవేత్తలను కలువని నేతలు తెరచాటుగా వారితో సన్నిహితంగా మెలుగుతారని..పారిశ్రామికవేత్తల విమానాల్లో వీరు విహరిస్తుంటారని మోదీ ఆరోపించారు.దేశ అభివృద్ధికి సహకరించే పారిశ్రామికవేత్తలను దొంగలని ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. కాగా రైతులు, అణగారిన వర్గాల వారిని విస్మరిస్తూ ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని రాహుల్‌ సహా కాంగ్రెస్‌ నేతలు పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు