వైద్య సిబ్బందిపై దాడులు సహించం : మోదీ

1 Jun, 2020 12:23 IST|Sakshi

వైద్యులపై ప్రధాని ప్రశంసలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దుందుడుకు వైఖరి ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వైరస్‌ కంటికి కనపడని శత్రువే అయినా కరోనా యోధులైన మన  వైద్య సిబ్బంది అజేయులని, మహమ్మారిపై వీరు తప్పక విజయం సాధిస్తారని ప్రధాని కొనియాడారు. వైద్యులు, వైద్య సిబ్బంది యూనిఫాం లేని సైనికులని ప్రశంసలు గుప్పించారు.

బెంగళూర్‌లోని రాజీవ్‌ గాంధీ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ నేడు భారత వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఆశగా కృతజ్ఞతా భావంతో చూస్తున్నాయని చెప్పారు. ప్రపంచమంతా మీ నుంచి స్వస్థతను, స్వాంతనను కోరుతున్నాయని వైద్య సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.

చదవండి : కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు!

మరిన్ని వార్తలు