లాక్‌డౌన్‌: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?

30 Mar, 2020 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క‌రోనా వైరస్‌పై ప్ర‌పంచ దేశాలు పోరాటం చేస్తున్నాయి. వైరస్‌ క‌ట్ట‌డికి భారత్‌లోనూ ప‌టిష్ట‌ చ‌ర్య‌లు అమ‌లవుతున్నాయి. దేశంలో లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ ఆదివారం మోదీ మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ కాలంలో మోదీ ఎలా చురుకుగా ఉంటున్నార‌ని ఓ వ్య‌క్తి ప్ర‌ధానిని ప్ర‌శ్నించారు. దీనిపై స్పందించిన‌ మోదీ సోమ‌వారం ట్విట‌ర్ ద్వారా స‌మాధాన‌మిచ్చారు. ఇందుకు ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మోదీ యానిమేష‌న్‌లో ఉన్న వివిధ యోగా ఆస‌నాల‌ను వర్ణిస్తోంది. కాగా అంతర్జాతయ యోగా దినోత్సవం సందర్భంగా గత ఏడాది ప్రధాని యానిమేటెడ్ వర్షన్‌ను కలిగి ఉన్న వీడియోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

‘లాక్‌డౌన్‌లో నా ఫిట్‌నెట్ గురించి నిన్న జ‌రిగిన మ‌న్‌కీ బాత్ సంద‌ర్భంగా ఓ వ్య‌క్తి న‌న్ను అడిగారు. అందుకు ఈ యోగా వీడియోల‌ను షేర్ చేయాల‌ని అనుకుంటున్నాను. మీరు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా యోగా  చేస్తార‌ని నేను న‌మ్ముతున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. అదే విధంగా ఇది త‌న‌కెంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని మోదీ తెలిపారు.

‘నేను ఫిట్‌నెస్ నిపుణుడిని, వైద్య నిపుణుడిని కాదు. యోగా సాధన కొన్ని సంవత్సరాలుగా నా జీవితంలో ఒక భాగంగా మారింది. ఇది నాకెంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంది.  చాలామందికి ఫిట్‌గా ఉండటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని నేను న‌మ్ముతున్నాను. కావున వాటిని  మీరు కూడా త‌ప్ప‌కుండా ఇత‌రుల‌కు షేర్ చేయండి. యోగా వీడియోలు వివిధ భాషలలో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూడండి. యోగా ప్రాక్టీస్ చేయడం చాలా సంతోషంగా ఉంది.’ అంటూ దేశ‌ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

మరిన్ని వార్తలు