భారత్‌ గట్టిగా పోరాడుతోంది: మోదీ

27 Jun, 2020 12:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడి కోసం భారత్‌ గట్టిగా పోరాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లాక్‌డౌన్‌తో పాటు ఇతర చర్యల మూలంగా కరోనా నియంత్రణలో ఇతర ప్రపంచ దేశాల కంటే ముందున్నామని పేర్కొన్నారు. శనివారం రెవరెండ్ జోసెఫ్ మార్ తోమా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు.  ‘‘ దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోంది. ఇటలీ కంటే మన దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ. కులము, మతము, నమ్మకం ఆధారంగా ప్రభుత్వం ఎవరి పైనా వివక్ష చూపదు. ( ‘మోదీ మౌనంగా ఉంటూ కరోనాకు లొంగిపోయారు’)

మాకు రాజ్యాంగమే మార్గదర్శి. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుతో పేదలకు బియ్యం ఎక్కడ ఉన్నా అందజేశాం. జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాము. మధ్యతరగతి ప్రజల ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం అనేక చర్యలు చేపట్టాం. రైతుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించాం’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు