21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం : మోదీ

25 Feb, 2020 14:21 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత అమెరికా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య చారిత్రక హైదరాబాద్‌ హౌజ్‌ వేదికగా మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఇరు దేశాధినేతలు ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ట్రంప్‌ కుటుంబానికి, అమెరికా ప్రతినిధుల బృందానికి మరోసారి మోదీ హార్ధిక స్వాగతం పలికారు. తన మిత్రుడు ట్రంప్‌నకు నిన్న మొతెరాలో  ఇచ్చిన అపూర్వ, సదా స్మరణీయ స్వాగతం ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.(ఇక్కడ చదవండి: చిన్నారుల స్వాగతానికి మెలానియా ఫిదా)

గడిచిన ఎనిమిది నెలల్లో ట్రంప్‌తో తనకిది ఐదో భేటీ అని ప్రధాని తెలిపారు. భారత్‌-అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ట్రంప్‌ తాజా పర్యటన ఇరు దేశాల సబందౠలను మరింత బలోపేతం చేసిందన్నారు. తమ సమావేశాల్లో రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని మోదీ తెలిపారు. అత్యాధునిక రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని పేర్కొన్నారు. అత్యాధునిక రక్షణ ఉత్పత్తి సంస్థలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. భారత రక్షణ వ్యవస్థలో ఈ సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయని అన్నారు. సైనిక శిక్షణలో ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల మధ్య ఒక అవగాన కుదిరిందని చెప్పారు. అమెరికాతో ఓ భారీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని ప్రధాని వెల్లడించారు. అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నారి ఆనందం వ్యక్తం చేశారు.(ఇక్కడ చదవండి: పాక్‌ను హెచ్చరించిన ట్రంప్‌)

మోదీ పేర్కొన్న మరికొన్ని అంశాలు..
అంతర్గత భద్రతపై ఒకరికొకరు సహకరించుకుంటున్నాం
మాదక ద్రవ్యాలు, నార్కో టెర్రరిజంపై ఉమ్మడిగా ఉక్కుపాదం
మానవ అక్రమ రవాణాపై రెండు దేశాలు ఉమ్మడిగా పోరాటం
రెండుదేశాల మధ్య ఇటీవల 20 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం
ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారికి వ్యతిరేకంగా రెండు దేశాల పోరాటం
ఆర్థిక సంబంధాల్లో పారదర్శక వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం
అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన రెండు దేశాలకు కీలకం

మరిన్ని వార్తలు