'చారిత్రక తీర్పుతో న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది'

24 Nov, 2019 15:57 IST|Sakshi

న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన తర్వాత ప్రజలు చూపిన సహనం, నిగ్రహం, పరిపక్వతను పరిశీలిస్తే జాతి ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదని రుజువు చేసి చూపారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన మన కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. చారిత్రక తీర్పు తర్వాత దేశం కొత్తం మార్గం, కొత్త సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. కొత్త సంకల్పంతో అడుగులు వేస్తున్న దేశానికి శాంతి, ఐక్యత, సద్భావన వంటి అనుభూతులను పంచుతూ ముందుకు సాగాలనేది తన కోరిక అని మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా మన్‌కీబాత్‌లో అయోధ్య సమస్యపై 2010లో అలహాబాద్ హైకోర్టు  ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం, సమాజం, ప్రజలు సహృద్భావం, శాంతి సామరస్యాన్ని ఎలా కొనసాగించారో ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు 130 కోట్ల మంది భారతీయులు శాంతి, ఐక్యతను పెంపొందించుకొని మెలిగిన తీరు తనకు సంతోషం కలిగించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్య వివాదం పై సుదీర్ఘ న్యాయ పోరాటం ముగిసిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దేశ ప్రజలకు మరోసారి న్యాయవ్యవస్థ పై అపారమైన గౌరవం పెరిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిజమైన అర్థంతో తీర్పును వెల్లడించి సుప్రీకోర్టు న్యాయవ్యవస్థ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించిందని మోదీ పేర్కొన్నారు.


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు తలలు, మూడు చేతుల శిశువు

ఈనాటి ముఖ్యాంశాలు

అనిల్‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

అజిత్‌కు కౌంటర్‌ ఇచ్చిన శరద్‌ పవార్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏమో కానీ.. : సుప్రియా సూలే

ఆవుదూడలకు ఇక ఆ బాధ ఉండదు..!

దంతెవాడలో మావోయిస్టుల విధ్వంసం

మహాట్విస్ట్‌ : మోదీకి అజిత్‌ ట్వీట్‌

ఒక లీటర్ తాగి చెప్పండి..ఎలా ఉందో..!

కీచక గురువు.. సన్నిహితంగా ఉండమంటూ..

పవార్‌ వ్యూహం.. అజిత్‌కు ఆహ్వానం!

మహా సంక్షోభం: సుప్రీం కీలక ఆదేశాలు

బీజేపీపై నిప్పులు చెరిగిన సంజయ్‌ రౌత్‌

ఒకేచోట 86,707 సూర్యనమస్కారాలు

అజిత్‌ పవార్‌కు ఝలక్‌..!

వయసు 23 ఏళ్లు.. పెళ్లిళ్లు నాలుగు!

వారికి ఎస్పీజీ భద్రత ఉపంసహరణ.. కారణాలివే!

పరువు కోసం.. భర్తకు పెళ్లి చేసిన భార్య

అసలు సీనంతా మోదీ, పవార్‌ భేటీలోనే..!

‘శరద్‌కు కేంద్ర పదవులు’

గీత దాటితే వేటు ఎప్పుడు?

అప్పుడు బాబాయ్‌.. ఇప్పుడు అబ్బాయ్‌

భోపాల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయండి

అజిత్‌ దాదా పవర్‌ ఇదీ...

అవినీతి ఆరోపణలు.. ఈడీ కేసులు

26 నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ47 కౌంట్‌డౌన్‌

ఆ ఎమ్మెల్యేలపై శరద్‌ పవార్‌ మండిపాటు

బలహీనవర్గాల సంక్షేమమే ఊపిరిగా జీవించారు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరు ఇంట్లో అలనాటి తారల సందడి

ప్లీజ్‌ అలా పిలవద్దు.. : నాగచైతన్య

ప్లీజ్‌..‘ప్రభాస్‌’ అప్‌డేట్‌ కావాలి

అల.. వైకుంఠపురములో: ఆనందంగా ఉంది కానీ..

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను చుక్కలు చూపించాడు’

ఆర్‌ఆర్‌ఆర్‌ : కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన ఫ్యాన్స్‌