ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి

29 Oct, 2016 02:33 IST|Sakshi
ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి

న్యూఢిల్లీ: దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళికి చైనా సరిహద్దుల్లోని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ)తో కలిసి మోదీ వేడుకలు చేసుకోనున్నారు. ఇందుకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మనా అనే గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. చైనా ైవె పున భారత భూభాగంలోని చిట్టచివరి గ్రామం ఇదే.

మోదీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా మనాకు వెళ్తారు. 2014 దీపావళిని సియాచిన్‌లోనూ, గతేడాది పండుగను పంజాబ్ సరిహద్దుల్లోనూ మోదీ జవాన్లతో కలసి జరుపుకున్నారు. మరోవైప# #Sandesh2Soldiers ద్వారా సైనికులకు శుభాకాంక్షలు పంపాలన్న మోదీ వినతికి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా 10 లక్షల సందేశాలు వచ్చాయి. ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు