వ్యవస్థను అవిటిని చేశారు

30 Aug, 2017 01:26 IST|Sakshi
వ్యవస్థను అవిటిని చేశారు

► యూపీఏ హయాంలో అంతా అస్తవ్యస్తం: ప్రధాని మోదీ
► మా ప్రభుత్వం దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది
► సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నాం


ఉదయ్‌పూర్‌ (రాజస్తాన్‌): గత పాలకులకు భిన్నంగా దేశాభివృద్ధి కోసం ఎన్‌డీఏ ప్రభు త్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోం దని...దృఢవిశ్వాసంతో వాటిని అమలు చేస్తోం దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటిం చారు. యూపీఏ హయాంలో వ్యవస్థ అవిటిదైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా యని చెప్పారు. అయితే తాము భిన్న మూలాల నుంచి వచ్చామన్నారు.

దేశాభివృ ద్ధికి బాటలు వేయడంలో భాగంగా సవాళ్లను స్వీకరించి, వాటికి పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. మోదీ మంగళవారం రాజస్తాన్‌లో రూ.15వేల కోట్లతో చేపట్టిన పలు రహదారుల ప్రాజె క్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 873 కిలోమీటర్ల మేర పూర్తయిన 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఖెల్గోవన్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని ప్రసంగిం చారు. రోడ్లు బాగుంటే... పూలు అమ్మేవాడి నుంచి చాయ్‌వాలా వరకూ అందరూ మంచి ఆదాయం పొందుతారన్నారు.

చెడును తొలగించడం పెద్ద సవాలు
‘మేము చేపట్టిన పనులను పూర్తిచేసేందుకు పాటుపడతాం. ధైర్యంతో నిర్ణయాలు తీసుకొం టాం. అంతే దృఢచిత్తంతో వాటిని అమలు చేస్తాం. రాజస్తాన్‌లో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులు రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తాయి. ఇది ఓ చారిత్రక ఘట్టం. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో హామీలివ్వడం ఆనవాయితీగా మారిపోయింది.

దశాబ్దాలుగా ఈ సంప్రదా యం కొనసాగుతోంది. వ్యవస్థలో చెడును తొలగించడం పెద్ద సవాలు. దాన్ని రూపుమా పడానికి ఎంత శక్తిసామర్థ్యాలు కావాలో ఊహ లకందదు’అని ప్రధాని చెప్పారు. తమ ప్రభు త్వం అభివృద్ధి కార్యక్రమాల వేగం, స్థాయి, పరిధి పెంచిందన్నారు. ఈ ‘యుద్ధవీరుల గడ్డ’లో ఎన్‌డీఏ ప్రభుత్వం అభివృద్ధి మాత్రమే చేసిందని... రాజకీయాలు కాదని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా ఉంటామన్నారు.

జీఎస్టీతో డ్రైవర్ల ఆదాయం పెరిగింది
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అపూర్వమైన సంస్కరణని, రాత్రికిరాత్రి దేశంలో పన్ను విధానాన్ని సమూలంగా మార్చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు. దీని వల్ల రవాణా ఖర్చు తగ్గి ట్రాక్టర్‌ ట్రాలీలు, ట్రక్కుల డ్రైవర్ల ఆదాయం పెరిగిందన్నారు. దేశ రవాణా రంగంలో మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. చిన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు 15 రోజుల కార్యక్రమం చేపట్టాలని అధికారులను కోరారు. కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ మాట్లాడుతూ... దేశంలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి మోదీ ప్రభుత్వం మూడేళ్లలో చేసి చూపిందన్నారు.

మరిన్ని వార్తలు