ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు

27 Oct, 2019 18:04 IST|Sakshi

రాజౌరి : భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఆర్మీ అధికారులతో కలిసి ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన వీడియోనూ మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలనే త్యాగం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆర్మీ అధికారులతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కాగా, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొదటిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన మోదీ ఆర్మీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రిగేడ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆర్మీ అధికారులుతో సమావేశంలో ఆర్మీ సిబ్బందితో కరచాలనం చేస్తూ , స్వీట్లు పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బంది తమ సంతోషాన్నిమీడియాతో పంచుకున్నారు. 'స్వయంగా ప్రధాని ఇక్కడకు రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మాతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ప్రధాని మోదీకు కృతజ్ఞతలు' అని ఓ సైనికుడు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం..

అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్

కరోనా: 5 వేలు దాటిన కేసులు.. అక్కడ తొలి మరణం

కరోనా: ‘క్వారెంటైన్‌’ ఎలా వచ్చింది?

ఈ మేలు మర్చిపోము: ట్రంప్‌

సినిమా

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు

ఒక్కసారి ఒరిజినల్‌ సాంగ్‌ వినండి: రెహమాన్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!