'ఆన్ లైన్ మోసాల్లో చిక్కుకోవద్దు'

1 Sep, 2016 14:07 IST|Sakshi
'ఆన్ లైన్ మోసాల్లో చిక్కుకోవద్దు'

ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. తన పేరు చెప్పి, పీఎం సంతకం అని చెబుతూ కొందరు అడ్డదార్లలో డబ్బు సంపాదించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఆ సంతకాలేవీ తనవి కాదని ఈ విధంగా తన పేరు చెప్పి ఆన్ లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఆన్ లైన్ మోసాలతో

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పీఎం సంతకం నకిలీదని పేర్కొంటూ పీఎంవో కూడా ఈ విషయాలపై ట్వీట్ చేసింది. మోదీ ఫొటోలను మార్ఫింగ్ చేశాడన్న కారణంగా గత మేలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్ జాబితాలో పీఎం మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు