‘నమామి గంగా’పై మోదీ సమీక్ష

15 Dec, 2019 03:24 IST|Sakshi
ఒడ్డున ఉన్నవాళ్లకు మోదీ అభివాదం

కాన్పూర్‌: గంగా నది శుద్ధీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలకు ప్రత్యక్ష తార్కాణంగా నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నమామి గంగా ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి మొదటి భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో శనివారం ఈ భేటీ జరిగింది.

నదీ జలాలను రక్షించేందుకు అది ప్రవహిస్తున్న రాష్ట్రాలకు 2015–20 వరకు రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని సంబంధిత వ్యవహారాల అధికారులు తెలిపారు. భేటీ అనంతరం మోదీ అరగంట పాటు గంగానదిలో బోటు షికారుకు వెళ్లారు. ప్రయాణం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఘాట్‌ మెట్లు ఎక్కుతుండగా ఆయన పట్టు జారి పడిపోయారు. వెంటనే ఆయన వెంట ఉన్న బలగాలు ఆయనకు సహాయం చేశాయి. అన్ని మెట్లలో ఒక మెట్టు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఘటన జరిగినట్లు ఎస్పీజీ బలగాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు