గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్‌

21 Oct, 2018 12:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి పలువురు మహనీయులు అసమాన సేవలు అందించినా వారిని మరుగుపరిచేందుకు గాంధీ, నెహ్రూ కుటుంబాలనే తెరపైకి తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి పలువురు నేతలు స్వాతంత్రో‍ద్యమంలో విశేష సేవలందించినా గాంధీ, నెహ్రూ కుటుంబానికే పేరుదక్కేలా ప్రయత్నాలు సాగాయని అన్నారు. తమ ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసిందన్నారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబాస్‌ ఆజాద్‌ హింద్‌ సర్కార్‌ ప్రకటించిన 75 సంవత్సరాలయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్రో‍ద్యమంలో సుభాష్‌ చంద్రబోస్‌ విలువైన సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. ఎందరో నేతల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వరాజాన్ని సురాజ్యంగా మలుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు గత నాలుగేళ్లుగా పలు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ టోపీని ధరించి పాల్గొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు