వాతావరణ పరిరక్షణే లక్ష్యం

17 Feb, 2018 03:04 IST|Sakshi

ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సులో మోదీ

న్యూఢిల్లీ: వాతా వరణ పరిరక్షణకు భారత్‌ కట్టుబడి ఉందని, అయితే మిగిలిన వారే తమ తమ వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని  మోదీ అన్నారు.  శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సులో మోదీ మాట్లాడారు. ‘మార్పు తీసుకొచ్చేందుకు అందరమూ నిబద్ధతతో ఉన్నాం. అభివృద్ధిని భారత్‌ నమ్ముతుంది.

అదే సమయంలో వాతావరణ పరిరక్షణకు కూడా కట్టుబడి ఉంది’ అని చెప్పారు.  ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సమానత్వం, న్యాయం, వాతావరణ న్యాయం వైపు తమను నడిపిస్తున్నాయని చెప్పారు. 2030 నాటికి 3 బిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాౖMð్సడ్‌ను కరిగించేందుకు కార్బన్‌ సింక్‌ రూపొందించే విషయంపై మాట్లాడుతూ.. ‘ఈ లక్ష్యాన్ని సాధించే విషయంలో భారత్‌ స్థిరమైన వృద్ధి సాధిస్తోంది’ అని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు