చంద్రయాన్‌ 2 : ఇది స్వదేశీ విజయం

28 Jul, 2019 13:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన చంద్రయాన్‌ 2ను లాంఛ్‌ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని, ఈ ఏడాది భారత అంతరిక్ష, శాస్త్ర పరిశోధనా రంగాలకు సానుకూలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో చంద్రయాన్‌ 2 నిర్ధేశిత కక్ష్యలోకి చేరే క్షణం కోసం మనమంతా ఉద్విగ్నంగా వేచిచూస్తున్నామని చెప్పారు.

జలవనరులను జాగరూకతతో కాపాడుకునేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు. మేఘాలయ, హర్యానాలు వాననీటిని ఒడిసిపట్టేందుకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమైనవని అన్నారు. నీటి వనరుల సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం నెలకొందని చెప్పారు.

మరిన్ని వార్తలు