మోదీ విదేశీ ప్రయాణ ఖర్చు ఎంతో తెలుసా?

22 Nov, 2019 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: గత మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాలకు ప్రత్యేక విమానాల కోసం రూ.255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2016–19 సంవత్సరాల మధ్య ప్రధాని చార్టెర్డ్‌ విమానాల ఖర్చు సుమారు రూ.255 కోట్లని వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికైన∙ఖర్చు అందాల్సి ఉందన్నారు. వీటితోపాటు 2016–18 సంవత్సరాల మధ్య ప్రధాని విదేశీ నేతలతో హాట్‌లైన్‌ సంభాషణలకైన ఖర్చు సుమారు రూ.3 కోట్లని తెలిపారు.

నాలుగు నెలల వ్యవధిలో ప్రధాని మోదీ ఏడుసార్లు విదేశీయానం చేసి 9 దేశాలు చుట్టివచ్చినట్టు మురళీధరన్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఆగస్టు నుంచి నవంబవర్‌ వరకు.. భూటాన్‌, ఫ్రాన్స్‌, యూఏఈ, బహ్రెయిన్‌, రష్యా, అమెరికా, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్‌, బ్రెజిల్‌ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. సెప్టెంబర్‌లో అమెరికాలో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి భారత ప్రభుత్వం నిధులు సమకూర్చలేదని మంత్రి మురళీధరన్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టెక్సస్‌ ఇండియా ఫోరంతో ఎటువంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. (చదవండి: మంత్రులపై ప్రధాని అసంతృప్తి)

మరిన్ని వార్తలు