ప్రధాని క్షమాపణకు పట్టు

26 Nov, 2016 01:20 IST|Sakshi

ప్రతిపక్షాల ఆందోళనతో ఏడో రోజూ సాగని ఉభయ సభలు
న్యూఢిల్లీ: వరుసగా శుక్రవారం ఏడో రోజూ పార్లమెంట్ సమావేశాలు చర్చ లేకుండానే వారుుదా పడ్డాయి. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న తమను విమర్శిస్తున్న ప్రధాని మోదీ  క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు ఇరు సభలను స్తంభింపచేశారుు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఉభయ సభల్లో నినాదాలు చేస్తూ వెల్‌లో ఆందోళన చేపట్టారు. నల్లధనం మార్చుకునేందుకు సమయం ఇవ్వనందునే నోట్ల రద్దును విమర్శిస్తున్నారన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వారుుదాపడ్డారుు.

రాజ్యసభ ప్రారంభం కాగానే మాజీ సభ్యుడు దిపెన్ ఘోష్ మృతికి సంతాపం తెలిపారు.  ప్రతిపక్షాల వద్ద నల్లధనం ఉందంటూ ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని, క్షమాపణలు చెప్పాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాండ్‌చేశారు.ప్రధాని సభకు రాకపోవడం  సభకు, ప్రతిపక్షాలకు అవమానమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రధాని క్షమాపణలు చెప్పరని, ప్రతిపక్షాలే క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. మరోపక్క.. లోక్‌సభలో కూడా ప్రధాని క్షమాపణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గందరగోళం కొనసాగింది.  ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రధాని సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో గందరగోళం రేగింది.  ‘వెల్‌లో నినాదాలు చేస్తూ... పేపర్లు చింపే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా? నేను అనుమతించను? అంటూ సభను స్పీకర్ సుమిత్ర అన్నారు. 

లోక్‌సభలో యువకుడి హల్‌చల్
న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం ఓ యువకుడు కొద్దిసేపు అలజడి సృష్టించాడు. పార్లమెంటు సభ్యుల విజిటింగ్ పాస్‌తో ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. సభ వారుుదా ప్రకటన వెంటనే లోక్‌సభ సాధారణ ప్రజల గ్యాలరీ నుంచి సభలో దూకేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం శివ్‌పురికి చెందిన రాకేశ్ సింగ్ బాఘెల్‌గా గుర్తించారు.

మరిన్ని వార్తలు