'ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి'

28 May, 2016 22:54 IST|Sakshi

న్యూఢిల్లీ : తమ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనపై శనివారం న్యూఢిల్లీలోని ఏక్ నయీ సుబాహ్ పేరుతో నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చేసిన ప్రతి పనిని సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. గ్యాస్ రాయితీలను ఆధార్తో అనుసంధానం చేశామని గుర్తు చేశారు. దీని వల్ల రూ. 15 వేల కోట్లు ఆదా అవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు